Header Banner

చిన్న నిర్లక్ష్యం ఖరీదు 17 నిండు ప్రాణాలు! ఆ ఒక్క పని చేసుంటే.. ఇంత ఘోరం జరిగేది కాదు!

  Sun May 18, 2025 17:30        Others

హైదరాబాద్‌లోని పాతబస్తీలో గుల్జార్ హౌస్‌లో తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. ఎయిర్ కండీషనర్ కంప్రెసర్ పేలడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. భవనంలో ఫైర్ ఎగ్జిస్ట్ లేకపోవడం, చెక్క ప్యానెళ్లు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ ఉలిక్కిపడింది. నగరంలోని పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున.. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ దారుణ సంఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్,కేటీఆర్ తదితరులు స్పందించి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలానే కేంద్ర ప్రభుత్వం బాధితులకు ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటంచింది.

 

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణంలో ఉన్న ఎయిర్ కండీషనర్ కంప్రెసర్ పేలడం వల్లే ఈ దారుణ జరిగిందని అధికారులు ప్రాథమికంగా అగ్నిమాపక శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. దీని కారణంగా విషపూరితమైన వాయువులు, దట్టమైన పొగ, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.

 

ఇది కూడా చదవండి: పెను విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి!

 

చిన్న నిర్లక్ష్యం వల్లే భారీ ప్రాణనష్టం..
అయితే మృతుల సంఖ్య ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణం చిన్న నిర్లక్ష్యం అంటున్నారు అధికారుల. బిల్డింగ్లో ఫైర్ ఎగ్జిస్ట్ లేకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందనే అభిప్రాయానికి వచ్చారు. అంతేకాక ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయన్నారు. కరెంట్ షాక్ వల్ల చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయని చెప్పారు.

 

పైగా ఇంత పెద్ద ఇంటికి ఒక్కటే ఎగ్జిట్ ఉందని.. బయట ద్వారం చాలా విశాలంగా ఉండి.. లోపల మాత్రం చాలా ఇరుగ్గా ఉందని.. మెట్లు కూడా సరిగ్గా లేవని అధికారులు తెలిపారు. ఇక తెల్లవారుజామున ప్రమాదం జరగడం వల్ల కూడా ప్రాణనష్టం అధికంగా సంభవించింది. అంటున్నారు అధికారులు. అందరూ మత్తుగా నిద్రపోయి ఉన్నారని.. ప్రమాదం గురించి తెలిసినా.. నిద్ర మత్తులో ఉన్న కారణం చేత సరిగా స్పందించలేదని.. షాక్ నుంచి తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు. ఫైర్ ఎగ్జిస్ట్ లేని కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

 

ప్రమాదంలో చిక్కుకున్న వారంతా ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు, మిగిలిన వారు పురుషులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

 

ఇది కూడా చదవండి: విశాఖ నుండి అక్కడికి డైరెక్ట్ వందే భారత్ స్లీపర్! రూట్లు ఏంటో చూడండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #TragicAccident #NegligenceKills #SafetyFirst #LivesLost #PreventableTragedy